హనుమంత వాహనంపై వెంకటేశ్వరస్వామి

10
- Advertisement -

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శనివారం ఉదయం 7 గంటలకు హ‌నుమంత వాహ‌నంపై కోదండ‌రాముని అలంకారంలో స్వామివారు ద‌ర్శ‌మిచ్చారు.

హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడిగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధిచెందాడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచనగావించిన మహనీయులు కనుక వీరిని ద‌ర్శించిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

మ‌ధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు పుణ్యాహవచనం, వసంతోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Also Read:Pawan:పవన్ ఫస్ట్ స్పీచ్..నవ్వులే నవ్వులు

- Advertisement -