ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

9
- Advertisement -

ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం ఏర్పాటుచేయనున్నారు. ఒంటిమిట్ట చెరువు మధ్యలో భక్తుల మది దోచేలా కొలువుదీరనుంది శ్రీ రాముడి విగ్రహం. ఆధ్యాత్మిక పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు టీటీడీ ప్రణాళికలు రచిస్తోంది.

ఈ విషయమై టీటీడీ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదికను అందజేశారు విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు. రానున్న 30 ఏళ్లలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఒంటిమిట్ట రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు టీటీడీకి నివేదిక సమర్పించారు.

ఒంటిమిట్టలోని రామాలయం చెంత ఉన్న చెరువు మధ్యలో 600 అడుగుల రాముని ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. రాముని నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసి, దర్శనానికి వచ్చే పర్యాటకుల ముఖాల్లో ఆనందం నింపేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.

Also Read:వెంకట్ మృతి..సాహిత్య రంగానికి తీరని లోటు

- Advertisement -