విరోచనాలు తగ్గట్లేదా.. ఇలా చేయండి!

79
- Advertisement -

కొన్నిసార్లు మనం తీసుకునే ఆహారం కడుపులో గందరగోళానికి గురి చేస్తుంది. ఆహారంలో నూనె శాతం అధికంగా ఉన్నా లేదా పాడైన ఆహార పదార్థాలను తిన్నా, కడుపులో సమస్య మొదలౌతుంది. గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు వేదిస్తాయి. ఇలాంటి సమయాల్లో విరోచనల బారిన పడే అవకాశం ఉంది. అయితే అయితే గంటలో రెండు సార్ల కంటే ఎక్కువ విరోచనాలు జరిగితే నీళ్ళ విరోచనలు లేదా లూజ్ మోషన్స్ అంటారు. ఈ యొక్క లూజ్ మోషన్స్ ను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదు. వెంటనే వైద్యుడిని సంప్రదించి వైద్యుడి సహాయం తప్పక తీసుకోవాలి. అయితే విరోచనల సమస్య కొద్దిగా ఉన్న సమయంలోని కొన్ని చిట్కాల ద్వారా విరోచనలకు చెక్ పెట్టవచ్చు ఆ చిట్కాలు ఏంటో చూద్దాం !

విరోచనాల బారిన పడిన వాళ్ళు గడ్డ పెరుగు తింటే ఈ సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చట. పెరుగులో ఉండే మైక్రో ఆర్గాన్స్ నీళ్ళ విరోచనలు చెక్ పెడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక అరటిపండు కూడా విరోచనలను తగ్గించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క పొడితో కలిపి అరటిపండు తింటే మంచి ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ తేనె, దాల్చిన చెక్క పొడి కలిపి ఈ మిశ్రమాన్ని సేవించిన లూజ్ మోషన్స్ కు చెక్ పడుతుంది. ఇక మరొక చిట్కా ద్వారా కూడా నీళ్ళ విరోచనాలను తగ్గించవచ్చు. ఒక గ్లాస్ నీటిలో తరిగిన అల్లం, దాల్చిన చెక్క వేసి బాగా మరింగించి ఆ తరువాత మరిగించిన నీటిని వడకట్టి ఆ నీటికి కొద్దిగా తేనె కలిపి సేవిస్తే విరోచనాలు వేంటంటే తగ్గిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఇంకా జీలకర్ర నీరు, పసుపు నీరు, నిమ్మరసం నీరు, మెంతులు కలిపిన పెరుగు వంటివి తీసుకున్న లూజ్ మోషన్స్ వెంటనే అదుపులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు

( గమనిక ; ఈ వ్యాసం సామాజిక మద్యమాల్లోని సమాచారం మేరకు కేవలం అవగాహన కోసం అందించడం జరుగుతుంది. ఇలాంటి చిట్కాలు సమస్య తీవ్రత కొద్దిగా ఉన్నప్పుడూ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కానీ సమస్య తీవ్రత అధికంగా ఉన్నప్పుడూ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం )

ఇవి కూడా చదవండి..

- Advertisement -