2024 మరో 14 రోజుల్లో ముగియనుంది. ఇక ఈ ఏడాది టాలీవుడ్‌లో ఎన్నో హిట్ సినిమాలు రాగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జోరు చూపించాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నెటిజన్లు ఎక్కుగా వెతికిన సినిమాలను పరిశీలిస్తే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898ఏడీ. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా సంచలన విజయం సాధించింది. ఈ భారీ పాన్ ఇండియా సినిమా గురించి ఎక్కువ మంది నెటిజన్లు సెర్చ్ చేశారు.
అలాగే విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజా’. సైలెంట్ గా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి థియేటర్లతో పాటు ఓటీటీలోనూ మంచి విజయం సాధించగా నెటిజన్లు ఈ సినిమా గురించి ఎక్కుగా వెతికారు. అలాగే విజయ్ 68వ చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ మూవీ సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలై భారీ వసూళ్లనురాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 460 కోట్లు వసూలు చేయగా ప్రేక్షకులు ఈ సినిమా గురించి తెగ వెతికారు.
చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమల్ బాయ్స్ సినిమా కూడా సైలెంట్ గా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. కేరళలోని మంజుమ్మల్ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు కొడైకెనాల్‌కు విహారయాత్రకు వెళ్తారు. అక్కడి గుహల్లో ఆ స్నేహితుల్లో ఒకరు డెవిల్స్ కిచెన్ అనే 900 అడుగుల గుహలో పడతాడు. అతనితో పాటు వచ్చి అతడిని కాపాడేందుకు పోరాడిన స్నేహితుల యదార్థ కథ ఆధారంగా తెరకెక్కించగా భారీ సక్సెస్‌ను అందుకుంది ఈ చిత్రం. అలాగే ఫహద్ ఫాజిల్ నటించిన సినిమా ఆవేశం. సినిమా గురించి తెగ వెతికారు నెటిజన్లు. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఈ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు డార్లింగ్. బన్నీ పుష్ప 2 సినిమాతో పాటు పలు చిన్న చిత్రాల గురించి నెటిజన్లు తెగవెతికేశారు.
Also Read:KTR: కేసులు పెట్టి శునకానందమా?