ఈ స్టాక్స్‌లో పెట్టుబడితే..లాభాలే!

4
- Advertisement -

స్టాక్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా…అయితే మంచి లాభాలను అందించే క్వాలిటీ స్టాక్స్ గురించి ట్రేడ్ నిపుణులు పలు సూచనలు..సలహాలు ఇచ్చారు. అందుకే ఆర్టెమిస్ మెడికేర్, ఈఐఎల్ నుండి టాటా స్టీల్ వరకు ఈ స్టాక్స్ వెనుక ఉన్న బలమైన కారణాలు..రాబోయే సంవత్సరాల్లో ఇవి మీ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను ఎలా బలోపేతం చేయగలవో తెలుసుకోండి.

శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో చివరి గంటలో దేశీయ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా భారీ పతనాన్ని చవిచూసింది. దీనివల్ల నిఫ్టీ 50, సెన్సెక్స్ సూచీలు చెరో 1% కంటే ఎక్కువ నష్టపోయాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి నెలకొన్న అనిశ్చితి కారణంగా మార్కెట్లో ప్రస్తుతం ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో మార్కెట్ గమనాన్ని ఊహించడం కంటే బలంగా ఉన్న వ్యక్తిగత స్టాక్స్‌పై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

() టాటా స్టీల్ …భారతదేశపు అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారులలో ఒకటైన టాటా స్టీల్…క్యూ4 (Q4) లో టన్నుకు రూ. 500 ఎబిటా లాభాలతో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. దేశీయంగా ఉక్కు ధరలు పెరగడం దీనికి బాగా కలిసివచ్చింది. రాబోయే రోజుల్లో (Q1FY27 లో) టన్నుకు రూ.6,000 మేర ఆదాయం మెరుగుపడే అవకాశం ఉంది. ఇది దేశీయ పోటీదారుల కంటే ఎక్కువ. నెదర్లాండ్స్, యూకే వ్యాపారాలలో కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కంపెనీ దేశీయ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 2032 నాటికి 45-50 MTPA కి (ప్రస్తుతం 27.4 MTPA) పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

() మహీంద్రా అండ్ మహీంద్రా..మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) ఆటోమొబైల్, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి రంగాలలో విస్తరించి ఉన్న ఒక ప్రముఖ సంస్థ. ఇది భారతదేశంలోనే అతిపెద్ద ట్రాక్టర్ల తయారీ సంస్థ (43.6% మార్కెట్ వాటా) మరియు దేశంలోనే రెండవ అతిపెద్ద కమర్షియల్ వాహనాల (CV), ప్యాసింజర్ వాహనాల (PV) తయారీ సంస్థ. ఎస్‌యూవీ (SUV) పోర్ట్‌ఫోలియోలో స్థిరమైన ప్రదర్శన మరియు బలమైన డిమాండ్ కారణంగా ఎం అండ్ ఎం ఆటోమొబైల్ రంగం మంచి వృద్ధి పథంలో ఉంది. కొత్త ఉత్పత్తుల లాంచ్ మరియు సామర్థ్య విస్తరణల కారణంగా ఈ స్టాక్ దీర్ఘకాలానికి సానుకూలంగా ఉంది.

() ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL). ఈ సంస్థ ఆర్థిక సంవత్సరం 2026 ముగింపు నాటికి దాదాపు రూ.15,109 కోట్ల రికార్డు స్థాయి ఆర్డర్ బుక్‌ను కలిగి ఉంది. ఇది గతేడాది కంటే 29% ఎక్కువ. పెద్ద అంతర్జాతీయ ఆర్డర్లు మరియు కన్సల్టెన్సీ వ్యాపారం ద్వారా రాబోయే 3-5 సంవత్సరాలకు స్పష్టమైన ఆదాయ వృద్ధి కనిపిస్తోంది. రిఫైనరీ విస్తరణలు, కోల్ గ్యాసిఫికేషన్ (బొగ్గు వాయువుకరణ) అవకాశాల వల్ల రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో కంపెనీ రెవెన్యూ మరియు లాభాలు (PAT) వరుసగా 16.2% మరియు 17.8% CAGR తో వృద్ధి చెందుతాయని, ఎబిటా మార్జిన్లు 9.1% నుండి 16.2% కి విస్తరిస్తాయని పాండే స్పష్టం చేశారు.

()ఆర్టెమిస్ మెడికేర్ సర్వీసెస్ . అపోలో టైర్స్ గ్రూప్ ప్రమోటర్లచే ప్రారంభించబడిన ఈ హెల్త్‌కేర్ సంస్థ…రోజుకు రూ.82,435 అత్యుత్తమ ARPOB (యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్) కలిగి ఉంది. దీనికి దాదాపు 32% ఆదాయం అంతర్జాతీయ రోగుల ద్వారానే లభిస్తుంది. ప్రస్తుతం గురుగ్రామ్‌లో ఉన్న 700 బెడ్ల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సామర్థ్యాన్ని రాబోయే 3-4 సంవత్సరాలలో బ్రౌన్‌ఫీల్డ్ విస్తరణ ద్వారా 2,000 కంటే ఎక్కువ బెడ్లకు పెంచాలని సంస్థ యోచిస్తోంది. ఆర్థిక సంవత్సరం 2026-28 మధ్య కాలంలో ఈ సంస్థ దాదాపు 28% రెవెన్యూ CAGR (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) సాధిస్తుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

Also Read:వెనక్కి తగ్గిన ‘పెద్ది’ నిర్మాతలు!

() విఎ టెక్ వాబాగ్ (VA Tech Wabag)..ఆర్థిక సంవత్సరం 2026 చివరి నాటికి వాబాగ్ కంపెనీ ఆర్డర్ బుక్ భారీగా రూ.17,235 కోట్లకు చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 26% వృద్ధిని సాధించింది. కంపెనీ తన అంతర్గత పరిమితుల కంటే 4 రెట్లు ఎక్కువ ఆదాయ వృద్ధిని చూపిస్తోంది. హై-మార్జిన్ డీశాలినేషన్ (ఉప్పునీటి శుద్దీకరణ), ఇండస్ట్రియల్ వాటర్ ప్రాజెక్టుల కారణంగా ఎబిటా మార్జిన్ 13-15% వరకు ఉంటుందని….రెవెన్యూ మరియు ప్యాట్ (PAT) వరుసగా 17.6% మరియు 27% CAGR వృద్ధిని నమోదు చేస్తాయని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.

- Advertisement -