RC15 మళ్లీ లాంగ్ బ్రేక్ !

21
- Advertisement -

రామ్ చరణ్, శంకర్ కాంబో సినిమా RC15 మరో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. శంకర్ ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ భారతీయుడు 2 కోసం కూడా పని ప్రారంభించాడు. శంకర్ ఈసారి ‘భారతీయుడు 2’ కోసం ఒక నెలకు పైగా పని చేయబోతున్నాడు.దీంతో రామ్ చరణ్ నెల రోజులు ఖాళీగా ఉండనున్నారు.

రామ్ చరణ్ ఈ సమయాన్ని ఆస్కార్ వేడుకలకు హాజరు కావడానికి అలాగే దర్శకుడు బుచ్చిబాబుతో చర్చలు జరపడానికి ఉపయోగించుకోనున్నాడని తెలుస్తుంది. మరో సినిమా స్క్రిప్ట్ కూడా ఫైనల్ చేస్తాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రామ్ చరణ్ RC 15 సినిమా 2023లో విడుదల కావడం లేదు. వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -