లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ లండన్ లో చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుండి ఆరువందలకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా భారత సంతతికి చెందిన బ్రిటీష్ ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా మరియు స్థానిక హౌంస్లౌ మేయర్ బిష్ణు గురుగ్ లు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, అదే స్పూర్తితో రాష్ట్ర మంత్రి కే.టి.ఆర్ గారి కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ప్రతీ సంవత్సరం లాగా నేడు కూడా వేడుకలను “చేనేత బతుకమ్మ మరియు దసరా” గా జరుపుకున్నామని సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.
నేడు చేనేతను ప్రోత్సహించడమే కాదు, గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ వల్ల ప్రపంచమంతా అల్లాడిపోయిందనే విషయం మనకు తెలుసునని, అప్పుడు ఎక్కడికక్కడ వారి స్థానిక ఆరోగ్య సిబ్బంది ప్రజల ప్రాణాలు రక్షించడానికి చేసిన కృషిని గుర్తు చేస్తూ గౌరవిస్తూ, ముఖ్యంగా యూకే లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS)కి , కీ వర్కర్స్ కి మరియు ప్రపంచవ్యాప్త కోవిడ్ వారియర్స్ కి కృతఙ్ఞతలు తెలుపుతూ లండన్ టవర్ బ్రిడ్జ్ ప్రతిమ ను ప్రత్యేక ఆకర్షణ గా నిలిపి దాని పై “THANK YOU NHS & KEY WORKERS” అని రాసి నేటి వేడుకలను వారికి అంకితం ఇస్తున్నామని వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.
భారత సంతతికి చెందిన స్థానికి ఎంపీలు వీరేంద్ర శర్మ మరియు సీమా మల్హోత్రా మాట్లాడుతూ, యూకే లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందని, ముఖ్యంగా నేడు ప్రపంచ ఆరోగ్య సిబ్బందికి ముఖ్యంగా యూకే లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS ), అలాగే ప్రపంచవ్యాప్త కోవిడ్ వారియర్స్ కోవిడ్ సందర్భంలో చేసిన సేవలను గౌరవిస్తూ వారికి కృతజ్ఞతగా నేడు లండన్ టవర్ బ్రిడ్జ్ ప్రతిమ పై “THANK YOU NHS & KEY WORKERS” అని రాసి ఇలా దాని చుట్టూ బతుకమ్మలను పెట్టి ఆడబిడ్డలంతా ఆడుతుండడం చూడడానికి ఎంతో స్ఫూర్తిగా ఉందని టాక్ సంస్థను చూసి గర్వపడుతున్నామని ఎంపీలు తెలిపారు.
టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్న మమ్మల్ని సంప్రదించవచ్చని, లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలని సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని గమనిస్తున్నామని, ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా ఉన్నట్టు తెలుకున్నామని, వారి ప్రతి పథకం వినూత్నంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఉన్నాయని, ప్రజలంతా భగవంతుని ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.
బతుకమ్మ సంబరాల ద్వారా కృతజ్ఞత తెలుపాలనే వినూత్న ఆలోచనకు అనిల్ కూర్మాచలం ని అలాగే దానికి ఎంతో సృజనాత్మకను జోడించి, దాన్ని ఒక లండన్ టవర్ బ్రిడ్జ్ ద్వారా తెలియజేసిన మల్లా రెడ్డి – శుష్మణ దంపతులను ఎంపీలు వీరేంద్ర శర్మ మరియు సీమా మల్హోత్రా లు ప్రత్యేకంగా ప్రసంశించారు.
టాక్ సంస్థ సంబరాల్లో సైతం సామాజిక బాధ్యతను మర్చిపోలేదని ఎంపీలు ప్రసంశించారు.హాజరైన ముఖ్య అతిథులు, ప్రవాసులు “CLAP FOR NHS లో భాగంగా గట్టిగా చప్పట్లు కొట్టి నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS ) సిబ్బంది అందిస్తున్న సేవలకు కృతఙ్ఞతలు తెలిపారు. స్థానిక హౌంస్లౌ మేయర్ బిష్ణు గురుగ్ మాట్లాడుతూ, టాక్ సంస్థ కేవలం వేడుకలకు సంబరాలకే పరిమితం కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలని నిర్వహిస్తుందని, ముఖ్యంగా కోవిడ్ సందర్భంగా ఎన్నారైలకు అలాగే స్థానికులకు వివిధ సేవా కార్యక్రమాలు చేసిందని అభినందించారు.
మా పిలుపు మేరకు హాజరైన ప్రవాసులు చేనేత బట్టలు ధరించి పాల్గొనడం మాకెంత సంతోషాన్ని మరియు స్ఫూర్తినిచ్చిందని టాక్ ఈవెంట్స్ ఇంచార్జ్ మల్లా రెడ్డి తెలిపారు.ఉపాధ్యక్షుడు సత్య చిలుముల మాట్లాడుతూ, దసరా పండుగ సందర్బంగా స్వదేశం నుండి తెచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన దసరా ” అలాయ్ – బలాయ్ ” కార్యక్రమం లో, చేనేత శాలువాలను ఒకరికొరకు పరస్పరం వేసుకొని, జమ్మి ( బంగారం) ని ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకొని, చేనేతకు చేయూతగా వీలైనన్ని సందర్భాల్లో చేనేత బట్టలు దరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
జమ్మి ఆకులు పంచుకుంటూ లండన్ పట్టణానికి ‘అలాయ్ బలాయ్’ ల తెలంగాణ స్నేహమాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి చూపించారని పలువురు ప్రశంశించారు.తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ మరియు దసరాపండగ సందర్బంగా మహిళలందరు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో, కోలాటాల నృత్యాలతో, చప్పట్లు కలుపుతూ, రంగు రంగుల బతుకమ్మలతో సందడి చేసారు.
బతుకమ్మల మద్య ఆరోగ్య సిబ్బందికి మైర్యు కోవిడ్ వారియర్స్ కి కృతజ్ఞత తెలుపుతూ ఏర్పాటు చేసిన లండన్ టవర్ బ్రిడ్జ్ వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆతిథులందరి ప్రశంసలందుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రత్యేకతను చాటి చెప్పేలా వినూత్నంగా ఎదో ఒకటి చేస్తామని కానీ నేడు మనమంతా ఇలా మళ్ళీ కోవిడ్ నుండి సాధారణ స్థితికి వస్తున్నారంటే దీనికి వెనకాల ఆరోగ్య సిబ్బంది మరియు కోవిడ్ వారియర్స్ కృషి ఎంతో ఉందని అందుకే ఈ బతుకమ్మ వేడుకల ద్వారా వారికి కృతజ్ఞలు తెలియజేస్తున్నామని ఉపాధ్యక్షురాలు శుష్మణ రెడ్డి తెలిపారు.
విదేశాల్లో స్థిరపడ్డా కానీ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటల్లో పాల్గొనడం కాకుండా, చిన్న చిన్న బతుకమ్మలతో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు.
ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులతో తో పాటు ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) మరియు కోవిడ్ వారియర్స్ కి బతుకమ్మ ద్వారా కృతజ్ఞతలు తెలుపడం ఎంతో స్ఫూర్తినిస్తుందని టాక్ సంస్థను అభినందించారు.
ఉద్యమ బిడ్డలుగా ప్రతి కార్యక్రమానికి సామాజిక బాధ్యతను జోడించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అన్నింటిని ప్రోత్సహించి విజయవంతం చేస్తున్న ప్రవాసులందరికి టాక్ కమ్మూనిటీ అఫైర్స్ చైర్మన్ నవీన్ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ ప్రధాన కార్యదర్శి సురేష్ బుడగం మాట్లాడుతూ ఈ వేడుకలలో భాగంగా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నట్టు పండుగకి వచ్చే ప్రతీ ఒక్కరినీ చేనేత వస్త్రాలు ధరించాలని కోరామని అలాగే చాలామంది ఈ రోజు చేనేత వస్త్రాలు ధరించడం సంతోషంగా వుందని అన్నారు.
టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న మాజీ ఎంపీ కవిత గారికి టాక్ ప్రధాన కార్యదర్శి జాహ్నవి దూసరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆలోచలనకు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని, ఎప్పటికప్పుడు వారి సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని తెలిపారు
ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాతే మన పండగలకు, మన సంస్కృతికి సరైన గౌరవం గుర్తింపు లభించిందని, ఉద్యమ నాయకుడే నేడు మనకు ముఖ్యమంత్రి గా ఉండడం వల్లనే నేడు అధికారికంగా రాష్ట్ర పండుగగా బతుకమ్మను నిర్వహించుకోగలుగుతున్నామని, కాబట్టి కెసిఆర్ గారి పేరు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని తెలిపారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చేనేతకు చేయూతగా చేస్తున్న వేడుకల్లో ఎంతో సామాజిక బాధ్యత ఉందని తెలిపారు.
టాక్ కార్యదర్శులు రవి రేతినేని మరియు సుప్రజ పులుసు మాట్లాడుతూ మా వేడుకలకు హాజరైన ప్రవాస సంస్థల ప్రతినిధులకు, సహకిరించిన మీడియా సంస్థలకు మరియు స్థానిక ప్రభుత్వ అధికారులకు కృతఙ్ఞతలు తెలిపారు.ఇక్కడికి వచ్చిన ప్రవాసులు, టాక్ సంస్థ ప్రతినిధులను ఉద్దేశించి ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణా సంస్కృతి ని ప్రపంచానికి చాటి చెప్తున్న టాక్ సంస్థని ప్రశంసించారు.
ఒక పక్క వ్యక్తిగతంగా ఇక్కడున్న బిడ్డలు రోజు వారి పనుల్లో బిజీగా వున్నప్పటికీ, బాద్యత గల తెలంగాణా బిడ్డలు గా ఆనాడు ఉద్యమం లో నేడు పునర్నిర్మాణం లో పోశిస్తున్న పాత్ర ఎందరికో ఎంతో స్పూర్తినిస్తుందని తెలిపారు.లండన్ టవర్ బ్రిడ్జి ప్రతిమను నిర్మించిన వారి సృజనాత్మకతను కృషిని అభినందిస్తూ మల్లా రెడ్డి శుష్మణ దంపతులను టాక్ సంస్థ నుండి చేనేత శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందించారు.ఉత్తమ బతుకమ్మకు మరియు బతుకమ్మ తెచ్చిన ఆడబిడ్డలకు బహుమతులను అందించారు.
ఈ కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు మరియు ఎన్నారై టి. ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, టాక్ ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి – సత్యమూర్తి చిలుముల, ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు మరియు టాక్ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి, టాక్ ప్రధాన కార్యదర్శులు సురేష్ బుడగం – జాహ్నవి దుసరి, అడ్వైసరి బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, కమ్మూనిటీ అఫైర్స్ చైర్మన్ నవీన్ రెడ్డి మరియు ముఖ్య సభ్యులు స్వాతి బుడగం, సుప్రజ పులుసు, వెంకట్ రెడ్డి దొంతుల,మల్లా రెడ్డి, సత్యపాల్ పింగిళి, గణేష్ పాస్తం ,రాకేష్ పటేల్, రవి రేటినేని, రవి ప్రదీప్ పులుసు, నవీన్ భువనగిరి,సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, జితేందర్ రెడ్డి బీరం, విజితా రెడ్డి, శ్రీ విద్య, వంశీ పొన్నం, వేణు నక్కిరెడ్డి, హరి గౌడ్ నవాబ్ పేట్,రాజేష్ వర్మ, శ్రీకాంత్ జెల్లా, క్రాంతి రేటినేని,మమత జక్కీ, శ్వేతా మహేందర్, శైలజ, ప్రియాంక రెడ్డి, సృజన, మౌనిక, అవినాష్, భూషణ్, శశి, ప్రిథ్వి, ప్రశాంత్ మామిడాల, శ్రీకాంత్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.