హైకోర్టు సీజేగా సతీష్ చంద్ర ప్రమాణస్వీకారం

66
gov

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శ‌ర్మ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్.. జ‌స్టిస్ స‌తీష్‌చంద్ర శ‌ర్మ చేత ప్ర‌మాణం చేయించారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుతో పాటు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అనంత‌రం ఆయ‌న‌కు గ‌వ‌ర్న‌ర్, సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. 2019 జనవరి 1న తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ 4వ వారు. తొలి సీజేగా జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌ పనిచేశారు. ఆ తర్వాత జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, అనంతరం జస్టిస్‌ హిమాకోహ్లీ ఆ బాధ్యతలు నిర్వర్తించారు.