లోక్ సభ ఎన్నికలు..మార్గదర్శకాలివే

25
- Advertisement -

లోక్ సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను జారీ చేసింది. ఎన్నికల రోడ్‌ షోలు, ర్యాలీల్లో పటాకులు పేల్చడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.

()అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించవద్దు
()కాన్వాయ్‌లో పది వాహనాల కంటే ఎక్కువగా ఉండొద్దు ( సెక్యూరిటీ వాహనాలు కాకుండా). ఒకవేళ ఎక్కువ సంఖ్యలో వాహనాలు ఉంటే అవి 100 మీటర్ల దూరంలో ఉండే విధంగా చూడాలి.
()ఒక బైక్‌ మీద ఒక జెండాను మాత్రమే పెట్టాలి. జెండా సైజు 1 అడుగు x ఆర అడుగు మాత్రమే ఉండాలి. జెండా కర్ర మూడు అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉండకూడదు.
()రోడ్‌ షోలను సెలవు రోజుల్లో నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. పీక్‌ అవర్స్‌లో కాకుండా ఇతర సమయాల్లో ర్యాలీలు నిర్వహించాలి. దవాఖానలు, బ్లడ్‌ బ్యాంకులు, ట్రామా కేర్‌ సెంటర్ల దగ్గర రోడ్‌ షోలను నిర్వహించవద్దు. రోడ్‌ను పూర్తిగా బ్లాక్‌ చేయవద్దు. వాహనాలు వెళ్లేందుకు ఒకవైపు ఖాళీగా ఉంచాలి. రోడ్‌ షోలో ఎంత మంది పాల్గొంటున్నారనేది ముందుగానే సమాచారం ఇవ్వాలి.

Also Read:Pawan:టార్గెట్ పిఠాపురం..జగన్ మాస్టర్ ప్లాన్!

()గరిష్ఠంగా బ్యానర్‌ సైజ్‌ 6X4 మాత్రమే ఉండే విధంగా చూడాలి.
()విద్యా సంవత్సరానికి ఆటంకం కలిగే విధంగా పాఠశాలలు, కళాశాలల్లో సభలు, సమావేశాలు నిర్వహించవద్దు. సభలు, సమావేశాలకు ఆయా విద్యా సంస్థల నుంచి ముందుగానే అనుమతి తీసుకోవాలి. ముందుగా వచ్చిన వారికి ముందుగా కేటాయింపు విధానంలో స్కూల్‌, కాలేజీ స్థలాలను కేటాయించాలి.
()దేవాలయాలు, చర్చిలు, మసీదు, గురద్వార్‌లను ఎన్నికల ప్రచారానికి వినియోగించడానికి వీలులేదు.
()కులం, మతం ఆధారంగా ఓట్లు అడగడానికి వీలులేదు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రవర్తించకూడదు.
()వ్యక్తిగత దూషణలు, విమర్శలు వద్దు. అభ్యంతరకర మెసేజ్‌లను ఓటర్లకు పంపకూడదు.
()తాత్కాలికంగా ప్రారంభించే పార్టీ కార్యాలయాలు పోలింగ్‌ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఉండాలి.
()లక్ష రూపాయలకు లెక్క చెప్పాలి

- Advertisement -