Loksabha:లోక్‌సభ నిరవధిక వాయిదా

23
- Advertisement -

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల చివరి రోజునే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వీబీజీ రామ్ జీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. లోక్‌సభలో మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించగా, రాజ్యసభలో మాత్రం తీవ్ర గందరగోళం మధ్య అర్థరాత్రి 12 గంటలకు ఓటింగ్ నిర్వహించారు.

ఈ బిల్లుపై సరైన చర్చకు అవకాశం ఇవ్వలేదని విపక్షాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. చర్చకు తగినంత సమయం ఇవ్వకుండా తొందరపాటుగా ఓటింగ్ నిర్వహించారని ఆరోపించాయి. ఈ క్రమంలోనే విపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. అయినప్పటికీ అధికార పార్టీ సభ్యుల మద్దతుతో బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందింది.

బిల్లు ఆమోదం అనంతరం విపక్షాలు పార్లమెంట్ ఆవరణలో నిరసనకు దిగాయి. గాంధీ విగ్రహం వద్ద గాంధీజీ ఫొటోలను పట్టుకొని ఆందోళన చేపట్టాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, పార్లమెంటరీ సంప్రదాయాలను ఉల్లంఘిస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి.

ఇక ప్రభుత్వం మాత్రం దేశ ప్రయోజనాల కోసమే ఈ బిల్లును తీసుకొచ్చామని, అన్ని నియమ నిబంధనల ప్రకారమే పార్లమెంట్‌లో ఆమోదం పొందిందని స్పష్టం చేసింది. ఈ పరిణామాల మధ్య పార్లమెంట్ సమావేశాలు ముగియడంతో, రాజకీయ వర్గాల్లో వేడి చర్చ కొనసాగుతోంది.

Also Read:TTD:29 నుండి తెప్పోత్సవాలు

- Advertisement -