తొలి విడత …నోటిఫికేషన్‌ జారీ

25
- Advertisement -

దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ జారీ కాగా ఇవాళ తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్‌ జారీతో నేటి నుంచే నామినేషన్‌లను స్వీకరించనున్నారు.

ఏప్రిల్‌ 19న తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నెల 27 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండగా బీహార్‌లో మాత్రం మార్చి 28 వరకు నామినేషన్‌ల దాఖలుకు అవకాశం కల్పించారు.

బీహార్‌ మినహా మిగితా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి 28న నామినేషన్‌ల స్క్యూటినీ ఉండనుండగా బీహార్‌లో మార్చి 30న నామినేషన్‌ల స్క్రూటినీ జరగనుంది. బీహార్‌ మినహా మిగిలిన ప్రాంతాల్లో మార్చి 30 నామినేషన్‌ల ఉపసంహరణకు తుదిగడువు కాగా బీహార్‌లో నామినేషన్‌ల ఉపసంహరణకు ఏప్రిల్‌ 2. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

తొలి విడతలో 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, రాజస్థాన్లోని 12 స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లోని 8 స్థానాలు ఉన్నాయి.

Also Read:గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణం

- Advertisement -