ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజల గుండె చప్పుడు అన్నారు ఏపీ మంత్రి నారా లోకేశ్. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన లోకేశ్.. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు తెలుగు ప్రజల గుండె చప్పుడై ప్రభజనం సృష్టించాయి అన్నారు. తెలుగుదేశం పార్టీకి గల్లీ రాజకీయాలు తెలుసు.. ఢిల్లీ రాజకీయాలూ తెలుసని లోకేశ్ అన్నారు.
తెలుగుదేశం జెండా పీకుతామన్నవాళ్లంతా అడ్రెస్ లేకుండా పోయారని అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన జెండా దించకుండా నిలబడ్డ పసుపు సైన్యానికి నారా లోకేశ్ హ్యాట్సాఫ్ చెప్పారు. నామినేషన్ పత్రాలు గుంజుకుంటుంటే తొడగొట్టి మీసం మెలేసిన అంజిరెడ్డి మన ధైర్యం, జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిన చంద్రయ్య మన పౌరుషం, కత్తివేటు పడి రక్తం కారుతున్నా పోలింగ్ బూత్ వదలని మంజులారెడ్డి మన దమ్ము అని లోకేశ్ అన్నారు.
Also Read:రాష్ట్రంలో రాక్షస పాలన: ప్రవీణ్ కుమార్
పార్టీలో సంస్కరణలు నాతోనే మొదలు కావాలి. మూడు సార్లు ఒకే పదవిలో ఉన్న వారు ఆ తరువాతి స్థాయికి వెళ్లాలి.. లేదా బ్రేక్ తీసుకోవాలని లోకేశ్ సూచించారు. పార్టీలో సీనియర్లు, జూనియర్లకు ప్రాధాన్యం ఉంటుంది… పనిచేసే వారికి మాత్రమే ప్రమోషన్లు ఉంటాయని తెలిపారు. రెడ్ బుక్ పేరు వింటేనే కొందరికి గుండెపోటు వస్తుంది.. ఇంకొందరు బాత్ రూమ్ లలో జారిపడుతున్నారంటూ లోకేశ్ అన్నారు.