తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ పై సిబిఐ అక్రమ కేసును ఖండిస్తూ దేవరుప్పుల చౌరస్తా ధర్నాలో పాల్గోన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి.. కాంగ్రెస్ అంటేనే మోసం… ఇలాంటి అసమర్ధ పాలనలో కాలేశ్వరం పైన కుట్ర చేస్తోంది అన్నారు.
కాళేశ్వరం అంటే
• 3 బ్యారేజ్ లు
• 15 రిజర్వాయర్లు
• 21పంప్ హౌస్ లు
• 203 కిలోమీటర్ల సొరంగం
• 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్
• 141 TMC ల స్టోరేజ్ …ఇంత పెద్ద ప్రాజెక్టు లో ఒక్క బ్యారేజీలోని 3పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్ట్ పోయినట్టా.? చెప్పాలన్నారు.
రాష్ట్రంలో మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడివి.?…కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డనే కాదు అది అందులో ఒక భాగం… కాలేశ్వరం పైన కాలయాపన చేసి మొత్తం గోదావరి జలాలను ఆంధ్ర కి తీసుకెళ్లే కుట్ర జరుగుతుంది … కాలేశ్వరాన్ని సిబిఐ కి అప్పజెప్పడం అంటే ఈ ప్రాజెక్టును ఎండబెట్టడమే… అక్కడేమో రాహుల్ గాంధీ సీబీఐ మోడీ చేతిలో ఉంది అంటుంటే … ఇక్కడేమో రేవంత్ రెడ్డి సిబిఐ కి కాలేశ్వరం అప్పజెప్పడం అనేది ఒక పెద్ద నాటక వ్యవహారం జరుగుతుంది అన్నారు.
కాళేశ్వరం మొత్తం 94 వేల కోట్ల ఖర్చు అయితే ఒక లక్ష కోట్లు అవినీతి అనడానికి సిగ్గుండాలి… మేడిగడ్డకు సుమారుగా 150 నుండి 200 కోట్ల రిపేరు ఖర్చు అవుతుంది అది కూడా మేడిగడ్డ నిర్మించిన కంపెనీ నే భరిస్తుందని చెప్పినా ఎందుకు రిపేరు చేయటం లేదు.?… అసెంబ్లీలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు అయినా సరిగ్గా సమాధానం చెప్పలేక సి.బి.ఐ కి అప్పచెప్పారు.!… ఘోష్ కమిషన్ కూడా చెప్పింది రిపేర్ చేయాలి అని… ఒక్క బ్యారేజ్ రిపేరు చేస్తే మిగతా ప్రాజెక్టు అంత ఓకే అని కదా అర్థం అన్నారు.
Also Read:యూరియా ఇవ్వలేని సర్కార్..రైతుల ఆగ్రహం
తెలంగాణ తెచ్చుకుందే నీళ్ల కోసం..ఇప్పుడు అదే నీళ్ళు ఆంధ్రాకి తరలుస్తూ మనం గోసపడే రోజులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తుంది… నాడు కేసిఆర్ రైతులకు యూరియా బస్తాలు ఇస్తే నేడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి డబ్బులు బస్తాలు మోసుకుపోతుండు… ఈ కార్యక్రమంలో జిల్లా మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు యూత్ సోషల్ మీడియా నాయకులు పెద్ద ఎత్తున పాల్గోని రాస్తా రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అన్నారు.

