బన్నీ–లోకేష్ మూవీపై!

9
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమాపై స్పష్టత రావొచ్చన్న అంచనాలతో సినీ వర్గాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ తాను ఏదో ప్రత్యేకమైన ప్రాజెక్ట్ షూటింగ్‌లో ఉన్నట్టు సంకేతాలు ఇవ్వగా, అది AA23కు సంబంధించినదేనని వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ఇండస్ట్రీలో బలమైన బజ్ ప్రకారం, అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో లాక్ చేసినట్టు సమాచారం.

‘పుష్ప’ చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి సంగీతం అందించే బాధ్యత అనిరుధ్ రవిచందర్‌కు అప్పగించే అవకాశం ఉందని టాక్. అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడగా, అధికారిక ప్రకటనతో అవి మరింత పెరగనున్నాయి.

Also Read:దావోస్‌కు సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -