బిగ్ డే పై సస్పెన్స్ కొనసాగుతోంది. మోడీ సర్కారుపై టీడీపీ,వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఏ మలుపు తీస్కోనుందన్న ఉత్కంఠకు తెరపడలేదు. పార్లమెంట్ ఉభయ సభలు టీడీపీ,వైసీపీ,టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనతో రేపటికి వాయిదా పడ్డాయి.
సభ ప్రారంభమైన 30 సెకన్లకే వాయిదా పడటం విశేషం. రిజర్వేషన్ల అంశంపై టీఆర్ఎస్ ఎంపీలు, ప్రత్యేక హోదా కోసం ఏపీ ఎంపీలు స్పీకర్ పొడియం ముందు ఆందోళనకు దిగారు. స్పీకర్ ఎంత వారించినా సభ్యులు వినలేదు. సభ ఆర్డర్‌లో లేదంటూ,అవిశ్వాసంపై చర్చించాలని ఉన్నప్పటికీ,కుదిరేలా లేదన్న సుమిత్రా సభను రేపటికి వాయిదా వేసింది.
మరోవైపు టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానికి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు మద్దతివ్వగా తాజాగా డీఎంకే కూడా తోడైంది. ఏపీ ప్రజల సంక్షేమం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్న ఉద్దేశంతో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు.