కరోనాను నియంత్రించడంలో భాగంగా మే 3 వరకు దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.కరోనాపై పోరులో భారత్ విజయం సాధించి తీరుతుందని స్పష్టం చేశారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని …కరోనా నియంత్రణలో భారత్ మొత్తం ఏకతాటిపై నిలిచిందన్నారు. కరోనా వేగంగా విస్తరిస్తోంది…ఈ మహమ్మారిని అరికట్టేందుకు ధృడంగా పోరాడుతున్నామని చెప్పారు.
కరోనా వల్ల జరిగే నష్టాన్ని భారత్ నిరోధించగలిగిందన్నారు. దేశం కోసం ప్రజలు సైనికుల్లా పనిచేస్తున్నారని తెలిపారు. చాలామందికి అన్నం దొరకడం లేదు..ప్రయాణాలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. లాక్ డౌన్‌కు సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
కరోనాపై పోరాటమే అంబేద్కర్‌కు నివాళి అన్నారు. దేశ ప్రజలందరి తరపున అంబేద్కర్‌కు నివాళి అర్పిస్తున్నానని చెప్పారు. ఇతర దేశాలతో పోల్చితే కరోనాపై పోరులో భారత్ మెరుగ్గా ఉందన్నారు. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నష్టం అందరికి తెలుసన్నారు.
భారత్ ఎప్పుడూ ఉత్సవాల మధ్య కన్నుల పండువగా ఉంటుందని కానీ కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. విదేశాల నుండి వచ్చిన వారిని 15 రోజులు ఐసోలేషన్‌లో ఉంచామని రద్దీగా ఉండే ప్రదేశాలను మూసివేశామన్నారు.