అక్కడ మళ్ళీ లాక్ డౌన్..

312
Lockdown
- Advertisement -

నాగ్ పూర్‌లో మార్చి 15 నుంచి 21 వరకు వారం రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ ను ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. కిరాణా, పాలు, కూరగాయలు వంటి నిత్యావసరాలతో పాటు అత్యవసర సేవలు మినహా మిగతా అన్నింటినీ మూసేస్తున్నట్టు వెల్లడించింది. గత కొద్ది వారలుగా కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో మహారాష్ట్రతో పాటు కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడుల్లోనే 85 శాతం కేసులు నమోదవుతున్నాయి.

ముందు జాగ్రత్త చర్యగా మహారాష్ట్ర సర్కారు లాక్‌ డౌన్‌ విధించింది. నాగ్ పూర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే అన్ని ప్రాంతాల్లోనూ లాక్ డౌన్ నిబంధనలు, ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు నాగ్ పూర్ కు చెందిన మంత్రి నితిన్ రౌత్ గురువారం దీనిపై అధికారిక ప్రకటన చేశారు. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22,854 కరోనా కేసులు నమోదైతే.. ఒక్క మహారాష్ట్రలోనే 13,659 మందికి పాజిటివ్‌గా తేలింది. మొత్తం కేసుల్లో 60 శాతానికిపైగా అక్కడే వస్తున్నాయి.

- Advertisement -