కరోనా విలయం.. ఢిల్లీలో లాక్‌డౌన్..

180
Delhi
- Advertisement -

దేశరాజధాని ఢిల్లీలో కరోనా విలయం సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లాక్‌డౌన్ ఈ రోజు(సోమవారం) రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం అంటే ఏప్రిల్ 26 ఉదయం 6 గంటల వరకూ కొనసాగనుంది. కరోనా చైన్ తెగ్గొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ సర్కారు వెల్లడించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈరోజు ఉదయం అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఈ వివరాలు వెల్లడించారు.

ఇక లాక్‌డౌన్ సందర్భంగా మాల్స్, జిమ్‌లు, ఆడిటోరియంలు మొదలైనవి పూర్తి స్థాయిలో మూసివేయనున్నారు. అయితే సినిమా హాళ్లు 30 శాతం సామర్థ్యంతో నడపనున్నారు. ప్రయివేటు సంస్థలన్నీ వర్క్ ఫ్రమ్ హోం ద్వారా పనిచేయాలనీ… ప్రభుత్వ కార్యాలయాలు, అత్యవసర సేవల విభాగాలు యధాతథంగా పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు. వీకెండ్ మార్కెట్ల నిర్వహణకు కూడా అనుమతి ఇచ్చారు.

ఆదివారం రోజున ఢిల్లీలో అత్య‌ధిక స్థాయిలో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. సుమారు 25,462 కొత్త కేసులు న‌మోదు కావ‌డంతో అక్క‌డ ఆందోళ‌న నెల‌కొన్న‌ది. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 30 శాతంగా ఉన్న‌ది. అంటే ప్ర‌తి మూడు శ్యాంపిళ్ల‌లో ఒక‌రు పాజిటివ్‌గా తేలుతున్నారు. ఈ నేప‌థ్యంలో క‌ర్ఫ్యూ ఆంక్ష‌ల‌ను పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం చెప్పింది. ఢిల్లీ హాస్పిట‌ళ్ల‌లో 100 క‌న్నా త‌క్కువ సంఖ్య‌లో ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్న‌ట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

- Advertisement -