- Advertisement -
రష్యాలో కరోనా తీవ్రస్ధాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ దేశ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. కేసులు ఎక్కువగా వస్తున్న మాస్కో సహా మరికొన్ని ప్రాంతాల్లో పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నారు. దాంతో స్కూళ్లు మూతపడ్డాయి.
అయితే నిత్యవసరాలకు మినహాయింపు ఇవ్వడంతో ప్రజలు లాక్డౌన్ను లెక్కచేయడం లేదు. మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. పరిస్థితి అదుపు తప్పితే సంపూర్ణ లాక్డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
రష్యాలో ఇప్పటివరకు 32శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఐతే వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతుండటం వల్లే కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. రోజుకు 40 వేలకుపైగా కేసులు నమోదవుతుండగా వెయ్యి మందికి పైగా చనిపోతున్నారు.
- Advertisement -