లాక్‌డౌన్‌ను ఎత్తివేసే ప్రక్రియ చాల ముఖ్యమని ఇదో ఈవెంట్‌లా కాకుండా జాగ్రత్తగా జరగాలన్నారు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన రాహుల్..ఆర్ధిక ప్యాకేజీ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచించాలన్నారు.
ఉపాధి హామీ పథకం ద్వారా 200 రోజులు పని కల్పించాలన్నారు. వృద్ధులు, రోగుల పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ఒకర్ని తప్పుపట్టే సమయం ఇది కాదు అని, కానీ వలస కూలీల సమస్యలను పరిష్కరించాలన్నారు.
ప్రజలకు నగదు అవసరం చాలా ఉందన్నారు. అవసరమైన వారికి నేరుగా నగదు ఇవ్వాలన్నారు. రాబోయ ఆర్థిక సునామీ గురించి కూడా ఆలోచించాలన్నారు. రైతులు, కార్మికులు, చిన్న,మధ్య తరహా వ్యాపారవేత్తలతో రేటింగ్స్ మెరుగుపడుతుందని, అందుకే వారికి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయాలన్నారు. యూపీలో వేరువేరు ప్రమాదాల్లో మృతిచెందిన వలస కూలీల కుటుంబాలకు సంతాపం తెలిపారు.