తెలంగాణలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు గందరగోళంగా మారాయి. బీసీ సామాజిక వర్గం నుండి ఒక్కరు కూడా లేని చోట బీసీ రిజర్వేషన్ కేటాయింపు చేశారు. అలాగే అసలు ఎస్సీలే లేని గ్రామంలో ఎస్సీ వర్గానికి సర్పంచ్ రిజర్వేషన్ కేటాయించడం సర్వత్రా చర్చకు దారితీసింది.
నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం పెరకపల్లె గ్రామంలో 500 ఓట్లు ఉంటే అందులో 4 ఎస్టీ ఓట్లు, మిగతావి బీసీ ఓట్లు ఉన్నాయని వెల్లడించారు గ్రామస్తులు. అసలు ఎస్సీలు లేని మా గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్సీ వర్గానికి ఎలా కేటాయించారని ఆందోళనకు దిగారు గ్రామస్తులు.
అలాగే నిర్మల్ జిల్లా హన్మాన్ తండా, ఆదిలాబాద్ జిల్లా సావర్గాం, పిచర, ఆరేపల్లి, నల్గొండ జిల్లా తూర్పుతండా, జైత్రాంతండా, నూనావత్ తండా, గోన్యతండా, మాన్ తండా, బాలాజీనగర్ పంచాయతీల్లో ఒక్క బీసీ ఓటు లేకున్నా బీసీ రిజర్వేషన్ కేటాయించింది ప్రభుత్వం. మరోవైపు ఖమ్మం జిల్లా మంగలితండాలో ఒక బీసీ మహిళ, ధర్మతండాలో ఒక బీసీ దంపతులు ఉండడంతో వారి గెలుపు లాంఛనంగా మారింది.
Also Read:ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు డాక్టరేట్

