స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రిలీజ్..

77
mlc
- Advertisement -

స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం స్థానిక సంస్థల నుండి ఒక్కో స్థానం ఉండగా కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి స్థానిక సంస్థల నుండి రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

నవంబర్ 23న నామినేషన్లకు చివరి తేదీ. డిసెంబర్ 10న పోలింగ్,డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన ప్రస్తుత సభ్యుల పదవీ కాలం ముగియనుంది.

ఇక ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్ధానాలకు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు,పాడి కౌశిక్ రెడ్డి,బండా ప్రకాశ్‌ పేర్లను ఖరారు చేశారు.

- Advertisement -