అమెజాన్‌ ప్రైమ్‌లో ‘దృశ్యం2’

52
drushyam 2

విక్ట‌రీ వెంక‌టేష్‌ న‌టించిన ‘దృశ్యం’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. దాంతో దానికి సీక్వెల్ గా ఇప్పుడు ‘దృశ్యం-2’ సినిమా రూపుదిద్దుకుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ మీనా వెంకీ సరసన నటించారు.

అయితే ఇన్ని రోజులు ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలవుతుందా లేక ఓటీటీలో విడుదలవుతుందా అనే విధంగా వార్తలు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 25న రిలీజ్ కానుంది. నిన్న రాత్రి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్ .. మీనా .. నరేశ్ .. సంపత్ రాజు .. శ్రీప్రియలతో పాటు, దర్శక నిర్మాతలు కూడా పాల్గొన్నారు.’దృశ్యం’ సినిమాకి మించి ఈ సినిమా ఆసక్తిని పెంచుతుందనీ, తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకులను ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

పెద్దగా చదువుకోని ఒక మధ్యతరగతి కుటుంబీకుడు, ఒక హత్యానేరం నుంచి తన భార్య బిడ్డలను ఎలా కాపాడుకున్నాడు అనేదే కథ. ఆరేళ్ల అనంతరం తిరిగి ఈ కేసును ఓపెన్ చేసి రాంబాబు ఫ్యామిలీ చేత నిజాన్ని ఏ విధంగా చెప్పించారు అన్న నేపథ్యంలో తెరకెక్కించారు.