18 ఎమ్మెల్సీ స్ధానాలకు షెడ్యూల్ రిలీజ్..

136
ts
- Advertisement -

తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం స్థానిక సంస్థల నుండి ఒక్కో స్థానం ఉండగా కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి స్థానిక సంస్థల నుండి రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పాటు ఎమ్మెల్యే కోటాలోని 6 ఎమ్మెల్సీ స్ధానాలకు మొత్తం 18 స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది.

నవంబర్ 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా నవంబర్ 23న నామినేషన్లకు చివరి తేదీ. డిసెంబర్ 10న పోలింగ్,డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన ప్రస్తుత సభ్యుల పదవీ కాలం ముగియనుంది.

- Advertisement -