స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయండి

3
- Advertisement -

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని ఈసీని కలిసి వినతి పత్రం అందజేసింది తెలంగాణ సర్పంచుల సంఘం. గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికల సందడితో ఇంటర్, 10వ తరగతి విద్యార్థుల విద్యాభ్యాసంపై పెను ప్రభావం చూపడమే కాకుండా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

కావున పరీక్షలు పూర్తి అయ్యాక ఎన్నికలు నిర్వహించాలని.. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ సర్పంచులు మండిపడ్డారు.

42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించినంకనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని.. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు.. అదేవిధంగా ఇంటర్,పదవ తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు నిర్వహించొద్దని వినతిపత్రం సమర్పించారు.

Also Read:ఎమ్మెల్సీ ఎన్నికలు.. రెబల్‌గా ఎమ్మెల్యే అనచరుడు!

సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్ లోని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను.. సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి…ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ తదితరులు కలిశారు.

- Advertisement -