లిటిల్ హార్ట్స్‌..వసూళ్ల జోరు!

5
- Advertisement -

యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ లిటిల్ హార్ట్‌ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. మౌలి తనుజ్ ప్రసాంత్, శివాని నగరం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అంచనాలను మించి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా, #90’s ఫేమ్ ఆదిత్య హసన్ ఈటీవీ విన్ బ్యానర్‌పై నిర్మించారు.

ఈ చిత్రం ఉత్తర అమెరికా బాక్సాఫీస్‌లో అద్భుతమైన మైలురాయిని దాటింది. భారీ $1 మిలియన్ మార్క్‌ను అధిగమించింది. డెబ్యూ హీరో, డెబ్యూ డైరెక్టర్‌తో తెరకెక్కిన చిత్రానికి ఇది సంచలన విజయమే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొదట లిటిల్ హార్ట్్స్ను డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ చేయాలని భావించారు. కానీ ఆ నిర్ణయం తప్పని తేలడానికి ఎంతోకాలం పట్టలేదు.

విడుదలైన ప్రతీచోటా పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకోవడమే కాదు మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, జయకృష్ణ, అనిత చౌదరి, ఎస్‌.ఎస్‌. కాన్చి, సత్య కృష్ణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంగీతం సిన్జిత్ యెర్రమిల్లి అందించగా, వంశీ నందిపాటి, బన్నీ వాస్ డిస్ట్రిబ్యూషన్‌ను నిర్వహించారు.

Also Read:గవర్నర్‌కు జమ్మి మొక్క అందజేత

- Advertisement -