ఓవర్‌సీస్‌లో అల..సత్తాచాటిన బన్నీ

503
allu arjun
- Advertisement -

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం `అల వైకుంఠ‌పురములో`. సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద 100 కోట్ల‌కు పైగా వసూళ్లను రాబట్టింది.

ఇక ఓవరీస్‌లోనూ సత్తాచాటాడు అల్లు అర్జున్‌. ఇప్పటివరకు ఓవ‌ర్‌సీస్‌లో 3 మిలియ‌న్ డాల‌ర్స్‌ను రాబ‌ట్టింది. ప్ర‌స్తుతం బాహుబ‌లి ది బిగినింగ్‌, బాహుబ‌లి 2 చిత్రాల త‌ర్వాత భ‌ర‌త్ అనే నేను 3.4 మిలియ‌న్ డాల‌ర్స్‌ను సాధించ‌గా.. రంగస్థ‌లం 3.5 మిలియ‌న్ డాల‌ర్స్‌ను సాధించింది.

రానున్న రోజుల్లో ఈ సినిమా రికార్డులను అల వైకుంఠపురములో బ్రేక్ చేయడం ఖాయమని అంతా అంచనా వేస్తున్నారు.

- Advertisement -