తెలంగాణలో గుడుంబా లేకుండా చేశామని తెలిపారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్..అకున్ సబర్వాల్ నేతృత్వంలో గ్రామాల్లో గుడుంబా లేకుండా చేశామని వెల్లడించారు. ఏపీ, కర్ణాటక,మహారాష్ట్ర,ఛత్తీస్ ఘడ్‌లలో మద్యం షాపులకు అనుమతివ్వడంతో మద్యం స్మగ్లింగ్ మొదలైందన్నారు.
తెలంగాణలో మద్యం షాపులు తెరుస్తున్నట్లు ప్రకటించారు సీఎం. గుడుంబాను అరికట్టేందుకు మాత్రమే మద్యం షాపులను తెరుస్తున్నామని చెప్పారు. మద్యం ధరలను 16 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం. చీప్ లిక్కర్‌పై 11 శాతం పెంచుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో కూడా మద్యం షాపులు ఓపెన్ చేస్తున్నట్లు వెల్లడించారు.
భౌతిక దూరం పాటించకుంటే షాపులు సీజ్ చేస్తామని తెలిపారు. షాపుల ఓనర్లు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.నో మాస్క్…నో లిక్కర్ అని…మాస్క్ లేకుంటే మందు ఇవ్వవద్దని తెలిపారు.ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు ఓపెన్ చేసి ఉంటాయని చెప్పారు.