విడుదలకు ముందే వివాదస్పదంగా మారిన మూవీ లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా.. ఈ మూవీకి అలంక్రిత శ్రీవాస్తవ్ దర్శకుడు.. నిర్మాత ప్రకాష్ ఝా. మహిళలపై కొనసాగతున్న వివక్ష నేపద్యాన్ని బేస్ చేసుకుని ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ మూవీలో కొంకణా సేన్ శర్మ, రత్నా పథక్ షా, అహనా కుమ్రా, ప్లబితా బోర్త్ కర్, విక్రాంత్ మెస్సీ కీలక పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ మూవీ రిలీజ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని.. A సర్టిఫికెట్ కాదుకదా ఈ మూవీనే బ్యాన్ చేయలంటూ సెన్సార్ బోర్డ్ సభ్యులు ప్రహ్లాజ్ నిహ్లానీ ఎందుకంత పట్టుపట్టారో ఈ మూవీ ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ట్రైలర్ మొత్తం సెక్స్ కంటెంట్‌తో నింపేశారు. బూతు సంభాషణలతో పాటు సెక్స్ సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా రెండు మూడు న్యూడ్ సీన్లతో ట్రైలర్‌ను రక్తికట్టించారు. శాంపిలే ఈ విధంగా ఉంటే ఇక సినిమాలో సెక్స్ కంటెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సెన్సార్ బోర్డ్ ఈ మూవీ రిలీజ్ అంగీరించేది లేదని తేల్చి చెప్పడంతో ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది చిత్ర యూనిట్. దీంతో అనేక తర్జనభర్జనల అనంతరం A సర్టిఫికేట్‌ను పొందింది ఈ చిత్రం. జూలై 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.