అర్జెంటీనా కెప్టెన్, ప్రపంచకప్ విజేత లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13 నుంచి 15 వరకు జరగనున్న మూడు నగరాల పర్యటనలో భాగంగా ముంబైకి రానున్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 14న వాంఖడే స్టేడియంలో ఆయన పాల్గొననున్నారు. మెస్సీ డిసెంబర్ 14న వాంఖడే స్టేడియంలో ఉంటారు… మాజీ, ప్రస్తుత క్రికెట్ ఆటగాళ్లతో క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది… అన్ని విషయాలు ఖరారైన తరువాత నిర్వాహకులు పూర్తి షెడ్యూల్‌ను ప్రకటిస్తారు అని తెలిపారు.
డిసెంబర్ 14న వాంఖడే స్టేడియంలో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీల బౌలింగ్‌కి ఎదురొడ్డి ఆడుతున్న మెస్సీని చూడొచ్చు. ఈ మ్యాచ్ ఏడు మంది ఆటగాళ్లతో జరగనుంది. సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లూ పాల్గొనవచ్చు. 2011లో కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో వెనిజులాతో జరిగిన అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ కోసం వచ్చారు మెస్సీ.
Also Read:తెలంగాణను నెంబర్ 1గా నిలబెడతాం:రేవంత్
మెస్సీ డిసెంబర్ 13 నుంచి 15 వరకు మూడు భారతీయ నగరాలను సందర్శించనున్నారు. కోల్‌కతాలో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఒక కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయనను సత్కరించనున్నారు. కోల్‌కతాలో తన పర్యటనలో భాగంగా మెస్సీ పిల్లల కోసం ఫుట్‌బాల్ వర్క్‌షాప్ నిర్వహించి, ఫుట్‌బాల్ క్లినిక్‌ను ప్రారంభించనున్నారు. ఆయన గౌరవార్థం “GOAT CUP” అనే ఏడు మంది ఆటగాళ్ల టోర్నమెంట్‌ను కూడా ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు.

