బైజూస్‌ అంబాసిడర్‌గా మెస్సీ

392
- Advertisement -

ప్రముఖ ఆన్‌లైన్‌ కోచింగ్‌ సంస్థ కీలకనిర్ణయం తీసుకుంది. ఆర్జెంటీనా పుట్‌బాల్‌ ఆటగాడు కెప్టెన్ లియోనెల్‌ మెస్సీని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నామని బైజూస్‌ సహావ్యవస్థాపకురాలు దివ్య గోకుల్‌నాథ్‌ శుక్రవారం ప్రకటించారు.

పారిస్ సెయింట్ జర్మైనక్‌ ఆడుతున్న మెస్సీ కి ప్రపంచవ్యాప్తంగా 3.5బిలియన్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. మరియు సోషల్‌మీడియాలో దాదాపుగా మెస్సీకి 450మిలియన్ల మంది ఫాలోయింగ్‌ ఉంది. కాబట్టి ఇతన్ని ఏంపిక చేసుకున్నట్టుగా బైజూస్‌లోని కీలకమైన ఓ ఆధికారి తెలిపారు.

ఈ సందర్భంగా బైజూస్‌ సహా వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్‌నాథ్‌ మాట్లాడుతూ… మా గ్లోబల్ అంబాసిడర్‌గా లియోనెల్ మెస్సీతో కలిసి పని చేయడం మాకు గౌరవం మరియు ఉత్సాహంగా ఉంది. అతను అట్టడుగు స్థాయి నుండి ఎప్పటికీ అత్యంత విజయవంతమైన క్రీడాకారులలో ఒకరిగా ఎదిగాడు. ఆ రకమైన అవకాశాన్ని బైజూస్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌ని సృష్టించాలనుకుంటోంది.

మానవ సామర్థ్యాన్ని పెంపొందించే శక్తిని లియోనెల్ మెస్సీ కంటే మరెవ్వరూ సూచించరు అని అన్నారు. అన్నట్టు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బైజూస్‌కు 5.5మిలియన్ల మంది పిల్లలకు ఆన్‌లైన్‌ ద్వారా కోచింగ్ ఇస్తుంది.

ఎప్పటికైనా గొప్ప ఆటగాడు కూడా అన్ని కాలాలలోనూ గొప్ప అభ్యాసకుడు కావడంలో ఆశ్చర్యం లేదు. ఈ భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను పెద్దగా కలలు కనేలా మరియు బాగా నేర్చుకోవడానికి స్ఫూర్తినిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని అన్నారు.

ఇవి కూడా చదవండి..

ఒకే సారి 32 మందితో వీడియో కాల్‌!

టీ20లోనెంబర్‌వన్‌ సూర్య భాయ్‌

అందగత్తె కాదు మోసగత్తె :లీలానీ

- Advertisement -