మీ మొబైల్ వాలెట్‌లో ఇంకా డబ్బులున్నాయా…?

211
Linking Aadhaar with Paytm: KYC deadline expires; here's how you ...
- Advertisement -

మొబైల్ వాలెట్‌ల వాడకం ఈ మధ్య విపరీతంగా పెరిగిపోయింది. పేటీఎం, మొబిక్విక్‌లాంటి వాలెట్లను షాపింగ్, బిల్ పేమెంట్, రీచార్జ్, మనీ ట్రాన్స్‌ఫర్‌కు వాడుతున్నారు. అయితే ఈ వాలెట్లకు కూడా ఫిబ్రవరి 28లోపు కేవైసీ (నో యువర్ కస్టమర్) వివరాలు ఇవ్వాల్సి ఉంది. ఈ డెడ్‌లైన్ గతేడాది డిసెంబర్ 31 వరకే ఉన్నా.. ఆర్బీఐ దానిని ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. ఇక పొడిగించకూడదని నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో కేవైసీ వివరాలు ఇవ్వకపోతే వాలెట్‌లో ఉన్న డబ్బుల పరిస్థితి ఏంటన్న ఆందోళన చాలా మందిలో ఉంది. అయితే ఆ డబ్బుకు వచ్చిన ఇబ్బందేమీ లేదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో స్పష్టంచేశారు. అందులో ఉన్న డబ్బుతో గూడ్స్, సర్వీసెస్ కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు.

అయితే మనీ ట్రాన్స్‌ఫర్ లేదా లోడ్ చేసేటప్పుడు మాత్రం కచ్చితంగా కేవైసీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మొత్తం 55 మొబైల్ వాలెట్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా బ్యాంకులకు సంబంధించి మరో 50 వాలెట్లు ఉన్నాయి. కేవైసీ వివరాల కింద ఓ కస్టమర్ తన ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్‌లాంటి వాటిని ఇవ్వొచ్చు.

- Advertisement -