క్రియేటివ్ దర్శకుడు శంకర్-కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఇండియన్ 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కమల్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోండగా ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ నటీనటులతో బాలీవుడ్ స్టార్లు కూడా నటించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు 80 శాతం పూర్తైనట్టు వార్తలు వచ్చాయి. అయితే దర్శక, నిర్మాతల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది. కేసు కూడా నడుస్తోంది. ఈ సినిమా పూర్తి చేయకుండా శంకర్ మరే సినిమాలు చేయకూడదని లైకా నిర్మాణ సంస్థ కేసు ఫైల్ చేసింది. కానీ కోర్టు దర్శకుడికి అనుకూలంగానే తీర్పునిచ్చింది.
అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారాం ప్రకారం దర్శకుడు శంకర్, లైకా నిర్మాతలు ఒక ఒప్పందానికి వచ్చారట. ప్రస్తుతం శంకర్ కమిటయిన రామ్ చరణ్ మూవీ పూర్తి చేసి.. ‘ఇండియన్ 2’ మొదలుపెట్టేలా రాజీ కుదుర్చుకున్నారట. మొత్తంగా ఇండియన్ 2కి లైన్ క్లీయర్ కావడంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
రెండు దశాబ్ధాల క్రితం వీరి కాంబినేషన్లో వచ్చిన ‘భారతీయుడు’ పెను సంచలనం సృష్టించింది. అవినీతి, అక్రమాలని అరికట్టడంలో ‘భారతీయుడు’ చూపించిన తెగువ అందరి మనసుల్లో బలంగా నాటుకుపోయింది. అవినీతి అరికట్టడంపై వివిధ భాషల్లో ఎన్నోసినిమాలు వచ్చాయి కానీ అవేవీ భారతీయుడు సినిమాలా ఆకట్టుకోలేకపోయాయి.