రివ్యూ: రొమాంటిక్

232
romantic

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్’. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిల్ పాదురి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో ఆకాష్ పూరి హిట్ కొట్టాడా లేదా చూద్దాం..

కథ:

గోవాలోని మల్టీపుల్ స్మగ్లర్ గ్యాంగ్ లో హీరో చేరుతాడు. తర్వాత డాన్‌గా మారిన వాస్కోడాగామా(ఆకాష్ పూరి) ఈ క్రమంలో ప్రేమలో పడిపోతాడు. తాను ప్రేమించిన వ్యక్తి ఓ ఉన్నాధికారి పోలీస్ కూతురు. ఓ పోలీస్ కూతరును ప్రేమించడమే కాకుండా అంతకు మించి చేస్తాడు. దీంతో ఆ పోలీస్ ఆఫీసర్ తీసుకునే యాక్షన్ ఏంటి?, చివరికి వారిద్దరూ కలిసారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, డైలాగ్స్‌. నటన పరంగా ఆకాష్ చాలా డెవలప్ అయ్యారు. ఎమోషనల్ సీన్స్ ని కూడా చాలా సులభంగా చేశారు. హీరోయిన్ కేతిక శర్మ మొదటి సినిమా అయినా చాలా బాగా చేశారు. మిగితా పాత్రల్లో రమ్య కృష్ణన్, సహాయ పాత్రలో నటించిన ఉత్తేజ్, మకరంద్ దేశ్ పాండే, సునైనా వీరందరు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో పూరి మార్క్ మిస్సవడం, గత సినిమాల్లోని కొన్ని సీన్స్ చూసినట్లు కనిపిస్తుంది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా బాగుంది. సునీల్ కశ్యప్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సీన్స్ ఇంకా ఎలివేట్ అయ్యాయి. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, సాంగ్స్ చిత్రీకరించిన విధానం కూడా చాలా బాగున్నాయి. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

హీరో, హీరోయిన్ మధ్య సాగే కెమిస్ట్రీ యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో చూడదగ్గ మూవీ రొమాంటిక్.

విడుదల తేదీ:29/10/2021
రేటింగ్:2.5/5
నటీనటులు : ఆకాష్ పూరి, కేతిక శర్మ, రమ్య కృష్ణన్
సంగీతం : సునీల్ కశ్యప్
నిర్మాత : పూరి జగన్నాధ్
దర్శకత్వం : అనిల్ పాదూరి