- Advertisement -
హీరో మంచు మనోజ్ తన రెండో పెళ్లిపై స్పందించారు. దివంగత భూమా నాగిరెడ్డి-భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికరెడ్డితో మంచు మనోజ్ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా ఆదివారం హైదరాబాద్‌లోని సీతాఫలమండిలోని వినాయక మండపానికి భూమా మౌనిక రెడ్డితో కలిసి వచ్చి పూజలు చేశారు.
దీనిపై మీడియా ప్రతినిధులు మనోజ్‌ని ప్రశ్నించగా… అది వ్యక్తిగత విషయమని, మంచిరోజున తానే అన్ని విషయాలు తప్పకుండా చెబుతాను అని తెలిపారు. వీరిద్దరికి గతంలో పెళ్లిళ్లుకాగా విడాకులు తీసుకున్నారు. ఇక భూమా మౌనిక రెడ్డితో పెళ్లి తర్వాత మనోజ్ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్ చేస్తున్నాయి.
- Advertisement -