ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. నేచురల్ స్టార్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యింది. దర్శకులు మారుతి, నందిని రెడ్డి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా ఆల్బమ్ లోని పాటలకు లైవ్ లో స్టేజ్ పై డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. గోల్కొండ హైస్కూల్ లో సంతోష్ శోభన్ నటన చూసి చాలా ఇంప్రెస్ అయ్యా. చాలా పరిణితితో నటించాడు. అప్పుడే దర్శకుడు ఇంద్రగంటితో చెప్పాను. సంతోష్ లో నన్ను చూసుకున్నా. మేమిద్దరం ఇంద్రగంటి స్కూల్ నుండే వచ్చాం. సంతోష్ చాలా సినిమాలు చేయడం ఆనందంగా వుంది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ తో వరుసగా విజయాలు రావాలని కోరుకుంటున్నాను. ఫరియా అద్భుతమైన యాక్టర్. జాతిరత్నాలు నాకు చాలా ఇష్టం. బ్రహ్మాజీ ఈ సినిమాలో అద్భుతమైన పాత్ర చేశారని గాంధీ చెప్పారు. గాంధీతో కాసేపు మాట్లాడితే నచ్చేస్తాడు. మారుతిని కలవడం చాలా ఆనందంగా వుంది. వెంకట్ బోయినపల్లి ఒకసారి ప్రేమిస్తే ప్రాణం పెట్టేస్తారు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటాను. కిరణ్, సుదర్శన్ .. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. నవంబర్ 4న లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ థియేటర్స్ లోకి వస్తోంది. సినిమా ఘన విజయం సాధించాలి” అని కోరుకున్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. గాంధీ టైమింగ్ నాకు చాలా ఇష్టం. సంతోష్ శోభన్ నానిని గురువులా భావించి మంచి నటుడిగా ఎదగడం ఆనందంగా వుంది. నా కెరీర్ బెస్ట్ ఇచ్చిన నాని ఇక్కడకి రావడం చాలా హ్యాపీగా వుంది. ఆయనతో మళ్ళీ కలసి పని చేయాలి. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ మంచి విజయం సాధించాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్” తెలిపారు.
హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. నిర్మాత వెంకట్ కి కృతజ్ఞతలు. మేర్లపాక గాంధీ తో మళ్ళీ మళ్ళీ పని చేయాలని వుంది. ఎక్ మినీ కథలో అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ రోజు లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ లో వున్నాను. ఫరియా అబ్దుల్లా హానెస్ట్ యాక్టర్. ప్రవీణ్ లక్క రాజు మంచి మ్యూజిక్ ఇచ్చారు. బ్రహ్మాజీ ఇండియాలోనే ఒక ఫైనెస్ట్ యాక్టర్. సుదర్శన్, మిర్చి కిరణ్ అందరికీ కృతజ్ఞతలు. నేను సినిమా ఇండస్ట్రీ వచ్చిన తర్వాత మొదట సలహా ఇచ్చింది, ప్రశంస ఇచ్చింది నాని. నానిని మొదట కలసినప్పుడు.. ”నీలో నన్ను చూసుకున్నాను” అని అన్నారు. ఇప్పటివరకూ నేను అందుకున్న బెస్ట్ కాంప్లీమెంట్ అది. నాని నుండే నేర్చుకున్నాను. ఆయనలానే డైలాగులు ప్రాక్టీస్ చేస్తుంటాను. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ నానికి చూపించాలని అనుకుంటున్నాను. నాని ఈ ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా వుంది” అన్నారు.
వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ.. మా సినిమాకి బెస్ట్ విశేష్ అందించడానికి వచ్చిన శ్యామ్ సింగరాయ్ నానికి కృతజ్ఞతలు. దర్శకుడు గాంధీ నాకు ఎప్పటినుండో తెలుసు. ఈ సినిమాకి పని చేసిన అందరినీ థాంక్స్” తెలిపారు.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ : లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. జాతి రత్నాలు సినిమాకి చాలా ప్రేమని ఇచ్చారు. ఆ సినిమా తర్వాత లీడ్ రోల్ చేస్తున్న రెండో సినిమా ఇది. మేర్లపాక గాంధీ చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఆయన ఫన్ టైమింగ్ బావుంటుంది. సంతోష్ శోభన్ తో కలసి నటించడం ఆనందంగా వుంది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. నా తొలి సినిమాతో పాటు ఈ సినిమా ట్రైలర్ ని కూడా ప్రభాస్ విడుదల చేయడం చాలా అనందంగా వుంది. ఆయనకి కృతజ్ఞతలు. ఈ వేడుకు వచ్చి మాకు బెస్ట్ విశేష్ అందించిన నాని, మారుతి,నందిని రెడ్డికి కృతజ్ఞతలు. నవంబర్ 4న సినిమా రిలీజ్ అవుతుంది. చాలా మంచి ఎంటర్ టైనర్. అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి” అని కోరారు.
చిత్ర దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ సంతోష్ శోభన్ కోసమే పుట్టింది. సంతోష్ చాలా గొప్ప నటుడు అవుతాడు. జాతిరత్నాలు తర్వాత మా సినిమా చేసిన ఫరియా అబ్దుల్లాకి కృతజ్ఞతలు. తనకి చాలా మంచి ఫ్యూచర్ వుంటుంది. ఈ సినిమాలో బ్రహ్మాజీ నట విశ్వరూపం చూస్తారు. సుదర్శన్, సప్తగిరి, మిర్చి కిరణ్.. చాలా మంచి నటులు వున్నారు. ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల మంచి పాటలు ఇచ్చారు. దావూద్ కి థాంక్స్. మా పై ప్రేమతో ఈ ఈవెంట్ కి వచ్చిన నాని, మారుతి,నందిని రెడ్డికి కృతజ్ఞతలు. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ చాలా ఫన్ అండ్ ఎంటర్ టైనింగా వుంటుంది. నవంబర్ 4న అందరూ థియేటర్లో చూడండి” అని కోరారు.
బ్రహ్మాజీ మాట్లాడుతూ.. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ చాలా ఎంజాయ్ చేశాం. నా కెరీర్ లో బెస్ట్ రోల్ అవుతుంది. గాంధీ నా కోసం దర్శకుడు అయ్యాడా అనిపిస్తుంది. అన్ని సినిమాల్లో మంచి రోల్స్ ఇచ్చాడు. సంతోష్ శోభన్, నానికి పోలికలు వున్నాయి. సంతోష్ , నాని అంత స్టార్ అవ్వాలి. నిర్మాత వెంకట్ బోయినపల్లికి కృతజ్ఞతలు. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ హిలేరియస్ ఎంటర్ టైనర్. సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ ఈవెంట్ కి వచ్చిన నాని కి కృతజ్ఞతలు” తెలిపారు.
సుదర్శన్ మాట్లాడుతూ.. గాంధీ నాకు అన్నీ సినిమాల్లో మంచి పాత్రలు ఇచ్చారు. ఇందులో కూడా చాలా మంచి పాత్ర. సంతోష్ శోభన్ తో వర్క్ చేయడం ఆనందంగా వుంది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ మంచి ఎంటర్ టైనర్. అందరూ థియేటర్లో చూడాలి’ అని కోరారు.
నందిని రెడ్డి మాట్లాడుతూ.. మేర్లపాక గాంధీ సినిమాలంటే ఇష్టం. ఎప్పుడూ ఒత్తిడిలో ఆయన సినిమాలే చూస్తాను. చాలా రిలీఫ్ గా వుంటుంది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ఫుల్ ఫన్ వుంటుందని అనుకుంటున్నా. సినిమా కోసం నేనూ ఎదురుచూస్తున్నా. ఫారియా లైవ్ వైర్ లా వుంది. బ్రహ్మాజీ యంగ్ గా వున్నారు. సంతోష్ బెస్ట్ యాక్టర్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి’ అని కోరారు.
ప్రవీణ్ లక్క రాజు మాట్లాడుతూ.. మేర్లపాక గాంధీతో పని చేయడం ఆనందంగా వుంది. సినిమా పాటలు అందరినీ నచ్చడం ఆనందంగా వుంది. సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది” అన్నారు. దావూద్, రామ్ మిరియాల, గోరటి వెంకన్న, శ్రీమణి, మిర్చి కిరణ్ తదితరులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బనారస్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్:సోనాల్
అనుకోని ప్రయాణం సక్సెస్ మీట్‌లో నటకిరీటి
మొక్కలు నాటిన BB6 కంటెస్టెంట్ అర్జున్