‘లైగ‌ర్’ టీజ‌ర్ వాయిదా..

86
Liger

హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం లైగర్. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకుడు. విజ‌య్ పుట్టిన‌రోజు ఆదివారం(మే 9). ఈ సంద‌ర్భంగా ఈ మూవీ నుంచి టీజ‌ర్ విడుద‌ల‌వుతుంద‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూశారు. అయితే ‘లైగ‌ర్’ యూనిట్ ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న కొవిడ్ సెకండ్ వేవ్ ప‌రిస్థితుల్లో టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌లేమ‌ని ప్ర‌క‌ట‌న‌న‌ను విడుద‌ల చేసింది.

ప్రస్తుతం దేశం కొవిడ్ కబంధ హస్తాల్లో చిక్కి విలవిల్లాడుతున్న స్థితిలో టీజర్ ను విడుదల చేయలేకపోతున్నామని, పరిస్థితులు కుదుటపడి ప్రశాంత వాతావరణం ఏర్పడేంత వరకు లైగర్ టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నామని వెల్లడించింది. అయితే, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గతంలో ఎన్నడూ కనిపించనంత విభిన్నంగా దర్శనమిస్తాడని హామీ ఇస్తున్నామని, ఎవరినీ నిరాశకు గురిచేయని రీతిలో సరికొత్తగా కనిపిస్తాడని ఆ ప్రకటనలో వివరించింది.