యూ ట్యూబ్‌ ట్రెండింగ్‌లో లైగర్‌!

54
liger
- Advertisement -

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ఆగస్టు 25న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా రెండు రోజుల క్రితం విడుదలైన సినిమా ట్రైలర్‌కు అనూహ్య స్పందనవస్తోంది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఏకంగా 50 మిలియన్‌కు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేసింది.

యాక్షన్ ప్యాక్డ్ గా ట్రైలర్‌ని పూరీ కట్ చేసిన విధానం సూపర్బ్‌గా ఉండగా ట్రైలర్ ను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుండగా, రమ్యకృష్ణ హీరో తల్లి పాత్రలో నటిస్తోంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

- Advertisement -