రండి కలిసి పనిచేద్దాం :కేటీఆర్‌

39
- Advertisement -

తెలంగాణలో స్త్రీలపై జరుగుతున్న ఆకృత్యాలను నివారించేలా తన వద్ద కొత్త ప్రణాళిక ఉందని దాని ద్వారా లైంగిక నేరస్థుల రిజిస్టర్‌ను ఏర్పాటు చేయవచ్చని సామాజిక కార్యకర్త పద్మశ్రీ అవార్డు గ్రహీత సునితా కృష్ణన్‌ చేసిన విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్‌ స్పందించారు.

అమెరికా తరహాలో లైంగిక నేరాల్లో ఉన్న వారి జాబితా తయారు చేయాలని ఆ జాబితా ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని సామాజిక కార్యకర్త సునితా ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌ను ఆమె కేటీఆర్‌ కు ట్యాగ్‌ చేశారు.

రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియల్లో సెక్స్‌ అఫెండర్స్‌ రిజిస్టర్‌ పనిచేస్తుందని ఆమె ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. నేరస్థుల జాబితాను తయారు చేసేందుకు తన వద్ద ఒక కాన్సెప్ట్‌ ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 20దేశాల్లో నిర్వహించిన పరిశోధనల ఆధారంగా ఆ విధానాన్ని రూపొందించామని దాన్ని సమర్పించేందుకు తాను సిద్దంగా ఉన్నట్టు ట్వీటర్‌లో పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్‌ ఈ రోజు సునితా ట్వీట్‌కు రిప్లై ఇస్తూ లైంగిక నేరస్థుల జాబితాను కచ్చితంగా తయారు చేద్దామన్నారు. నేరస్థుల జాబితాకు సంబంధించిన కాన్సెప్ట్‌ను ప్రభుత్వంకు ప్రజెంట్‌ చేయాలని ఆ కాన్సెప్ట్‌ను తాము కచ్ఛితంగా ఆమోదిస్తామని దానిని త్వరలోనే ప్రజల ముందుకు తీసుకువెళ్లనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

- Advertisement -