హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, ప్రగతి నగర్ వాసులను చిరుతపులి సంచారం వార్త వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఫోటోలు,వీడియో క్లిప్పింగ్‌లు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో స్ధానికులు భయాందోళనకు గురవుతుండగా ఫారెస్ట్ అధికారులు దీనిపై క్లారిటీ ఇచ్చారు.
కూకట్‌పల్లి ప్రగతినగర్ ప్రాంతాల్లో చిరుత సంచారం లేదని అది అడవి పిల్లి అని తేల్చారు. వదంతులు నమ్మొద్దని తెలిపారు.ఫారెస్ట్ అధికారులు ప్రగతినగర్-గాజుల రామారం మధ్య అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు.
ప్రగతినగర్‌లో జన సంచారం ఎక్కువగా ఉంటుందని, ఇక్కడ పులి సంచరించే అవకాశమే లేదని ఫారెస్ట్ అధికారులు చెప్పారురు. బుధవారం మధ్యాహ్నం చిరుత కూర్చుందని భావించిన రాతిగుట్టపై ఓ జంతువు మలవిసర్జన చేసినట్లు గుర్తించారు. ఇది అడవి పిల్లి విసర్జన అని తెలిపారు అధికారులు. దూలపల్లి అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి సిబ్బందితో కలిసి శ్వకర్మకాలనీ నుంచి మిథులానగర్ వరకు విస్తరించి ఉన్న 5కిలోమీటర్ల మేర ఫారెస్ట్ ఏరియా అంతా గాలించారు.