రాజేంద్రనగర్‌లో మళ్లీ చిరుత కలకలం!

354
chirutha
- Advertisement -

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మళ్లీ చిరుత కలకలం సృష్టించింది. రాజేంద్రనగర్ సమీపంలోని వ్యవసాయ యూనివర్శిటీ పరిసరాలతో పాటు ఓ ఇంటి కాంపౌండ్‌లోకి వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌లో కనిపించింది. దీంతో స్ధానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.

మే 14న కాటేదాన్ పరిధిలో రోడ్డుపై కనిపించింది చిరుత. ఓ లారీ డ్రైవర్‌పై దాడికి కూడా పాల్పడింది. అప్పటినుండి చిరుత కోసం అటవీశాఖ అధికారులు,పోలీసులు వేట కొనసాగిస్తూనే ఉన్నారు.

తర్వాత రాజేంద్రనగర్ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో మళ్లీ చిరుత పులి జాడ కనిపించింది. అక్కడి నుంచి అది గగన్‌పహాడ్‌ గుట్టల్లోని అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టుగా అధికారులు గుర్తించారు. తాజాగా ఓ ఇంటికాంపౌండ్‌లో చిరుత కనిపించడంతో స్ధానికులు భయాందోళనకు గురవుతున్నారు.

- Advertisement -