లెజెండ్ సీక్వెల్ రాబోతుంది..?

62
legend
- Advertisement -

బాలయ్య-బోయపాటి కాంబినేషన్ అంటే మాస్ ఆడియన్స్‌కు పండగే. ఎందుకంటే వీరికాంబోలో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్‌ హిట్లే. రీసెంట్‌గా వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ..బాలయ్య కెరీర్‌లో మైలురాయి చిత్రంగా నిలిచిపోగా మరోసారి సినిమా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు బాలయ్య – బోయపాటి.

లెజెండ్ సినిమాకి సీక్వెల్‌ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్రారట బోయపాటి. అఖండ నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించనున్నారట. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో ఆ తర్వాత లెజెండ్ సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉందట.

లెజెండ్ సినిమాకి పొలిటికల్ లైన్ కలిపి పొలిటిక‌ల్ సెటైర్లు, పంచ్‌ల‌తో ఈ సినిమా క‌థ ఉండేలా ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

- Advertisement -