కమల్ ‘విక్రమ్’ ఉగ్రరూపం..!

145
kamal
- Advertisement -

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ నటిస్తున్న చిత్రం విక్రమ్. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని లాంఛ్ చేశారు. సింహం, పులి, చిరుతపులి ఒక అడవికి వేటకు వెళితే అని కమల్‌ హాసన్‌ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమయ్యింది. విజయ్‌ సేతుపతి, ఫహద్‌ గ్యాంగ్‌స్టర్స్ గా కనిపించగా కమల్‌ హాసన్‌ రా ఏజెంట్‌గా కనిపిస్తారని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది.

ట్రైలర్‌లో కమల్‌, విజయ్‌, ఫహద్‌ లుక్స్ ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్స్, టీజర్‌ ఆకట్టుకున్నాయి. కమల్‌కి చాలా రోజుల తర్వాత మంచి హిట్‌ రానుందని తెలుస్తుండగా ముగ్గురు విలక్షణ నటులు కలిసి నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

- Advertisement -