రజినీ కబాలిని క్రాస్‌ చేసిన లెజెండ్‌ బాలయ్య..

275
- Advertisement -

నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం ”లెజెండ్” 950 రోజులను పూర్తి చేసుకొని, 1000 రోజులే లక్ష్యంగా దూసుకుపోతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్‌లో 1000 రోజులే లక్ష్యంగా దూసుకుపోతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. బాక్సాఫీసు దగ్గర ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకొంది. ఇది దక్షిణాదిలోనే రికార్డ్‌. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ పేరిట ఉన్న రికార్డును యువరత్న నందమూరి బాలకృష్ణ చెరిపేశారు. దక్షిణ భారతంలో ఇప్పటివరకూ ఎక్కువ రోజులు ఆడిన సినిమాగా రజినీకాంత్ ‘చంద్రముఖి’ పేరిట ఉన్న రికార్డు (891 రోజులు)ను దాటి ‘లెజెండ్’ సరికొత్త రికార్డును సృష్టించింది.

bla

ఇదివరకు ‘చంద్రముఖి’ సినిమా చెన్నైలోని ఓ థియేటర్‌లో 891 రోజులు నడిచింది. ఇప్పటివరకూ అదే రికార్డ్‌. ఇప్పుడు ‘లెజెండ్‌’ దాన్ని దాటేసింది. వెయ్యి రోజుల వేడుక ఘనంగా నిర్వహించాలని చిత్రబృందం భావిస్తోంది. 950 రోజుల పోస్టర్‌ని మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ప్రస్తుతం బాలయ్య తన వందో సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో నటిస్తోండగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో బాలయ్య అభిమానులు కొందరు దసరా.. దీపావళి.. మొహర్రం .. క్రిస్మస్ కానుకగా బాలకృష్ణ ఇంతవరకూ నటించిన 99 సినిమాలను రోజుకి ఒక ఆట చొప్పున ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు కు చెందిన బాలయ్య అభిమానులు వినూత్నంగా ఈ ప్లాన్ చేస్తోండగా లెజెండ్‌ సినిమా 950 రోజులు పూర్తి చేసుకున్న అర్చన థియేటర్లోనే ఈ సినిమాలను ప్రదర్శించడం విశేషం. ఇక బాలకృష్ణ 99 సినిమాలను 100 రూపాయల ఖరీదు గల ఒకే టికెట్ పై చూపించనున్నారట.

- Advertisement -