త్వరలో మరిన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ..

395
online news portal
- Advertisement -

ఉద్యమంలో కేసీఆర్ వెంట ఉన్న వారందరికి గుర్తింపు లభిస్తుందని మంత్రి కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. త్వరలో మరిన్ని నామినేటెడ్ పోస్టులు రాబోతున్నాయని తెలిపారు.రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఈద శంకర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…కష్టపడిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు.

నీటిపై అనుభవం ఉన్న ఈద శంకర్‌రెడ్డిని ఇరిగేషన్ ఛైర్మన్‌గా నియమిండం సంతోషకరమైన విషయమన్నారు మంత్రి హరీష్‌రావు. శంకర్‌రెడ్డిని నియమించిన సీఎం కేసీఆర్‌కు ధన్యావాదాలు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో లిఫ్టులన్ని మూలన పడ్డాయని తెలిపారు. వాటిని రిపేరు చేయించి తెలంగాణలోని ప్రతీ ఎకరాకు సాగునీటిని అందించేలా కృషి చేస్తున్నామన్నారు.

స్వరాష్ట్రంలో తెలంగాణ నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటు ముందుకు వెళుతోందని దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఎం కేసీఆర్ మిషన్ కాకతీయతో చెరువుల పునర్నిర్మాణం చేశారని వివరించారు. చెరువుల మట్టితో భూములు సారవంతమైనాయని పేర్కొన్నారు. కల్వకుర్తి లిఫ్టుతో పాలమూరు సస్యశ్యామలమవుతోందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఏ పాలమూరు బిడ్డ వలస పోడని చెప్పారు. గోదావరి జలాలను పూర్తిగా వినియోగించుకుంటున్నామని ..సాగునీటి విషయంలో ఖర్చుకు వెనుకాడబోమని ఎంపీ వినోద్ స్పష్టం చేశారు.

ఇక టీఎస్ఐఐసీ ఛైర్మన్‌గా బాలమల్లు కూడా మంత్రి కేటీఆర్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. బాలమల్లుకు పలువురు మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, నాయిని నర్సింహరెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే బొడిగే శోభ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -