తదుపరి సీజేఐ ఎవరో తెలపండి :కేంద్ర న్యాయశాఖ

62
- Advertisement -

భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి యూయూ ల‌లిత్ న‌వంబ‌ర్ 8వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ నేప‌థ్యంలో త‌దుప‌రి సీజేఐగా ఎవ‌ర్ని నియ‌మిస్తారో చెప్పాలంటూ ల‌లిత్‌కు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఇవాళ లేఖ రాసింది. కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆ లేఖ రాశారు. సుప్రీంకోర్టు త‌దుప‌రి సీజేఐని నియ‌మించాల‌ని ఆయ‌న ఆ లేఖ‌లో కోరారు.

సీనియార్టీ ప్ర‌కారం జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ త‌దుప‌రి సీజేఐగా బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుత సీజే ల‌లిత్ త‌ర్వాత ఆయ‌నే సుప్రీంలో సీనియ‌ర్ జ‌స్టిస్‌. జ‌స్టిస్ చంద్ర‌చూడ్ పేరును సీజే ల‌లిత్ ప్ర‌తిపాదించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. జ‌స్టిస్ చంద్ర‌చూడ్ చాలా రోజులు సీజేఐ ప‌దవిలో ఉండే ఛాన్సు ఉంది. ఒక‌వేళ చంద్ర‌చూడ్‌ సీజేఐగా నియామ‌కం చెందితే .. అప్పుడు ఆయ‌న 2024, న‌వంబ‌ర్ 10వ తేదీన రిటైర్ అవుతారు. అంటే రెండేళ్ల పాటు ఆయ‌న ఆ ప‌దవిలో ఉంటారు.

- Advertisement -