- Advertisement -
తెలంగాణ లెక్చరర్ సంఘము అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. మధుసూదన్ ఇంటి నుంచి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి ఆయన్ని తరలించారు. అక్రమంగా రూ. 3 కోట్ల ఆస్తులు గుర్తించారు. మధుసూదన్ రెడ్డిని కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు ఏసీబీ అధికారులు.
తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి కార్యాలయం పై ఏసీబీ సోదాలు నిర్వహించింది. నాంపల్లిలోని ఇంటర్ బోర్డ్ ఎదురుగా ఉన్న మధుసూదన్ రెడ్డి కార్యాలయంలో ఫైల్స్ చెక్ చేశారు . ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని ఆరోపణతో ఏకాలంలో ఇంటిపై , కార్యాలయంలో ఒకేసారి దాడులు చేశారు అధికారులు. 11 చోట్ల ఏకకాలంలో ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
- Advertisement -