త్వరలో టీఆర్టీ సమస్య పరిష్కారం: కేటీఆర్,సబితా

484
sabitha ktr

త్వరలోనే టీఆర్టీ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్…ఈ అంశంపై టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణితో మాట్లాడనని తెలిపారు. ఆయన తనకు హామీ ఇచ్చారని త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు.

టీఆర్టీ అభ్యర్థుల ఎంపిక జాబితాలను త్వరలో నే విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దీర్ఘకాలికంగా ఉన్న టి ఆర్ టి ల సమస్య కోర్టులో పరిష్కారం అయినందున సరైన జాబితాను అందజేయాలని టీఎస్‌పీఎస్సీ అధికారులను కోరానని తెలిపారు సబితా.