మహా బతుకమ్మకు ఏర్పాట్లు పూర్తి…

374
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగను ఆనందోత్సహాలతో జరుపుకుంటున్నారు. రంగు రంగు పూలతో పేర్చిన బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకుమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని ఆడుతూ…పాడుతూ ఊరువాడ బతుకమ్మ సంబురాలతో హోరెత్తుతున్నాయి. రాష్ట్ర పండుగైన బతుకమ్మకు అంతర్జాతీయ ఖ్యాతి సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో 10 వేల మంది మహిళలతో మహా బతుకమ్మ ఆడించి గిన్నీస్‌ రికార్డు నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేసింది.
ఇందుకోసం ప్రత్యేకంగా 20 అడుగుల బతుకమ్మను తీర్చిదిద్దుతున్నారు.

మహిళల సమీకరణ కోసం..ప్రతి కార్పోరేటర్ తప్పనిసరిగా 200 మందిని తీసుకురావాలని నిబంధన విధించారు. అంతేకాకుండా పొదుపు, మహిళా సంఘాల నుంచి కూడా భారీగా ఆడపడుచులను తరలించేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు మహిళలకు ఎల్బీ స్టేడియంలో శిక్షణ ఇస్తున్నారు.శనివారం 5 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Bathukamma

మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మహాబతుకమ్మ సంబరాల దృష్ట్యా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. వేడుకల్లో పాల్గొనే వారు నేరుగా ఎల్బీ స్టేడియం వైపు రావచ్చన్నారు.

– ఏఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ ఉంచి బీజేఆర్ విగ్రహం వైపు ట్రాఫిక్‌ను అను మతించరు. ఈ ట్రాఫిక్‌ను నాంపల్లి లేదా రవీంధ్రభారతి వైపు మళ్లిస్తారు.
– ఆబిడ్స్, గన్‌పౌండ్రీ నుంచి బషీర్‌బాగ్ వెళ్లే వాహనాలను బీజేఆర్ విగ్రహం వైపు అనుమతించరు. గన్‌పౌండ్రీ, చాపల్‌రోడ్డు మీదుగా ట్రాఫిక్‌ను మళ్లిస్తారు.

Bathukamma
– బషీర్‌బాగ్ నుంచి జీపీఓ వైపు వెళ్లే వాహనాలను, బషీర్‌బాగ్ జంక్షన్ నుంచి హైదర్‌గూడ, కింగ్‌కోఠి రూట్‌లోకి మళ్లిస్తారు.
– ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హిమాయత్‌నగర్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
– కింగ్‌కోఠి వైపు నుంచి బషీర్‌బాగ్ వచ్చే వాహనాలను కింగ్ కోఠి క్రాస్ రోడ్స్‌లో తాజ్‌మహల్ హోటల్ రూట్‌లో మళ్లిస్తారు.
– లిబర్టీ నుంచి బషీర్‌బాగ్ వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు.
– పోలీస్ కంట్రోల్ రూం వైపు నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వైపు వచ్చే వాహ నాలను నాంపల్లి వైపు మళ్లిస్తారు.

పార్కింగ్ స్థలాలు

– వెస్ట్, సెంట్రల్ జోన్ల నుంచి వచ్చే బస్సులు అయాకర్ భవన్ వద్ద ఆగి, నిజాం కాలేజీ గ్రౌండ్‌లో పార్కు చేయాలి.
– నార్త్, ఈస్ట్ జోన్ల నుంచి వచ్చే బస్సులు బీజేఆర్ విగ్రహం వద్ద ఆగి, ఎన్టీఆర్ స్టేడియంలోకి వెళ్లి పార్కు చేయాలి.
– సౌత్‌జోన్ నుంచి వచ్చే బస్సులు పబ్లిక్ గార్డెన్‌లో పార్కు చేయాలి.

bathukamma
– వీఐపీలు, ఇతర ఆహ్వానితులు తమ వాహనాలను బీజేఆర్ విగ్రహం వద్ద ఆపి, వాహనాలను అలియా కాలేజీ ఆవరణలో పార్కింగ్‌కు తరలించాలి.
– మంత్రులు వాహనాలు డీ గేట్‌లో నుంచి ప్రవేశించి, ఆ తర్వాత అలియా మోడల్ స్కూల్ ఆవరణలో పార్కు చేయాలి.

- Advertisement -