టీడీపీలోకి బిగ్ బాస్ కౌశల్..!

296
kaushal chandra babu
- Advertisement -

ఓ వైపు కౌశల్ ఆర్మీపై రోజుకో వివాదం కొనసాగుతుండగా అవేమీ పట్టించుకోకుండా సేవా కార్యక్రమాలతో ముందుకుసాగుతున్నారు బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్. ఇప్పటివరకు సామాజిక సేవ కార్యక్రమాలతో పేరు తెచ్చుకున్న కౌశల్ త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు.

గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ప్రజావేదికకు వచ్చిన కౌశల్..ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కౌశల్‌ను చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించగా ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు కూడా అంగీకరించారు. త్వరలోనే తన ప్రచారానికి సంబంధించిన కార్యాచరణను ప్రకటిస్తానని కౌశల్ చెప్పినట్టు తెలుస్తోంది.

చంద్రబాబుతో కౌశల్ భేటీలో మంత్రి గంటా శ్రీనివాసరావు కీలకపాత్ర పోషించారు. మరోవైపు రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ లేదా ఎంపీగా కౌశల్‌ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులతో ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్న కౌశల్ టీడీపీలో చేరుతారనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -